మా నమ్మకం నిజమైంది

18-10-2026 | 05:20am

సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth), నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన చిత్రం ‘జైలర్2’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిం చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 15న థిటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొని, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి శశి సొంతం చేసుకున్నారు. తెలుగునాట ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో నాగవంశీ, శశి ప్రెస్‌మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ.. “మేము నిర్మించిన సినిమా అయినా, పంపిణీ చేసిన సినిమా అయినా డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్ రావడం అనేది అరుదైపోయింది. ‘జైలర్2’ విషయంలో మొదట అందరూ భారీ రేటు పెట్టి తీసుకున్నామని భయపడ్డారు. కానీ, అక్టోబర్ 15 సాయంత్రం షోల వసూళ్లు చూసిన తర్వాత ఖచ్చితంగా కమీషన్ వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు.

రజనీకాంత్‌ని, నెల్సన్‌ని, అనిరుధ్‌ని నమ్మి రిస్క్ చేశాం. దానికి ప్రతిఫలం దక్కుతుండటం సంతోషంగా ఉంది” అన్నారు. శశి మాట్లాడుతూ.. “జైలర్2’ భారీ వసూళ్లు సాధిస్తుందని ఆశిస్తు న్నాం. నా అంచనా ప్రకారం విజయదశమి రోజుకే మేము బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాట పడతా మనేది నా నమ్మకం. ఈ విజయాన్ని చేకూర్చిన తెలుగు క్ష్రకులకు ధన్యవాదాలు” అన్నారు. 


మరిన్ని వార్తలు