సత్యవాన్ సావిత్రి మ్యాడ్‌నెస్!

15-10-2026 | 05:15am

కీర్తి సురేశ్(Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘సత్యవాన్ సావిత్రి(Satyavaan Savithri)’. నూతన దర్శకుడు ప్రవీణ్ ఎస్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కీర్తి సురేశ్‌ను సరికొత్తగా, పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో ఆవిష్కరించనున్న ఈ మూవీ టీజర్(Movie Teaser) బుధవారం విడుదలైంది. ఓ ఆసక్తికరమైన కోర్ట్‌రూమ్ డ్రామాను, అందులోని వినోదాత్మక, ఉత్కంఠభరిత అంశాలను ఆవిష్కరించిందీ టీజర్.

ఇందులో కీర్తి సురేశ్(Keerthy Suresh) తన వ్యక్తిగత సమస్యలను, భావోద్వేగభరితమైన జీవితాన్ని దాచుకుంటూనే సమాజంలో న్యాయం కోసం, సామాజిక బాధ్యత కోసం పోరాడే ఒక ఉత్సాహభరితమైన లాయర్ ‘సావిత్రి’గా కనిపిస్తుంది. సినిమా ప్రధాన కథాంశం న్యాయానికి, చట్టానికి మధ్య జరిగే సంఘర్షణ అని స్పష్టమవుతోంది. గురు-శిష్యుల లాంటి వీరిద్దరి మధ్య కోర్టు రూమ్‌లో జరిగే వాదోపవాదాలు, మైండ్ గేమ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 

లాయర్ కోటులో కీర్తి లుక్, ఆమె బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్టుగా సరిపోయాయి. ఒకవైపు ఎమోషన్స్, మరోవైపు కోర్టులో ‘సావిత్రి మ్యాడ్‌నెస్’ అంటూ సాగే వినోదభరిత హావభావాలు మెప్పిస్తాయి. సీనియర్ అడ్వొకేట్‌గా మిస్కిన్ గంభీరమైన నటన కీర్తి పాత్రకు సరైన కౌంటర్ ఇచ్చేలా ఉంది. సామ్ సీఎస్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీని, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. 

మరిన్ని వార్తలు