జోరుగా బీసీ రాజ్యాధికార యాత్ర

15-10-2026 | 05:15am

నాగర్ కర్నూల్ జిల్లా వట్టేం గ్రామానికి చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర

వట్టేం, అక్టోబర్ 14(విజయక్రాంతి): తెలంగాణలో బీసీ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార పాదయాత్ర’ బుధవారం 28వ రోజుకు చేరుకుంది. జడ్చర్ల నుంచి నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా వట్టేం గ్రామానికి చేరుకున్న తీన్మార్ మల్లన్నకు స్థానిక పార్టీ నాయకులు,మహిళలు ఘన స్వాగతం పలికారు. జడ్చర్ల నుంచి నాగర్‌కర్నూల్(Nagarkurnool) వైపుగా సాగుతున్న ఈ యాత్రకు జిల్లాలోని, పలు గ్రామాల్లో ప్రజలు, నాయకులు మల్లన్నను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్నారు.

పాదయా త్రలో భాగంగా జడ్చర్ల ప్రాంతంలో(Jadcherla region) పేద ప్రజల కోసం, వారి వైద్య సేవల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు ఉమ్మడి ఆనంద్ చిత్రపటానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. జడ్చర్ల ప్రాంతంలో పేదలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆనంద్ చేసిన పోరాటాన్ని, ఆ య న అందించిన సేవలను స్మరించుకున్నారు. కాగా యాత్ర తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామం మీదుగా సాగుతున్న క్రమంలో, గ్రామ సర్పంచ్ గోపాల్ నాయక్ మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిసి పాదయాత్రకు మద్దతు తెలిపారు.

వట్టెం గ్రామంలో టీఆర్పీ జెండా ఆవిష్కరణ 

బిజినేపల్లి మండల పరిధిలోని వట్టెం గ్రామంలో టీఆర్పీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.   టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథి గా హాజరై, పార్టీ జెండాను ఆవిష్కరించారు.  మల్లన్న మాట్లాడు తూ.. ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడటమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు