లతారెడ్డి.. ఎంత అందంగుంటదో..!
విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh), నందమూరి కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram), అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది దీనికి ట్యాగ్‌లైన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వెంకటేశ్, కల్యాణ్ రామ్, కృతిశెట్టి ఫస్ట్‌లుక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా, హీరోయిన్ కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న లతారెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో ట్రాక్టర్‌పై ఎంతో ధీమాగా కూర్చున్న కీర్తి సురేశ్ రస్టిక్ లుక్‌లో చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది. ఆమె కెరీర్లోనే అత్యంత ఆసక్తికరమైన, వినోదాత్మకమైన పాత్రల్లో లతారెడ్డి ఒకటిగా నిలవనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఊటీలో జరుగుతోంది. ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి; ఎడిటర్: తమ్మిరాజు; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్.
‘రౌడీ జనార్ధన’ నుంచి స్పెషల్ పోస్టర్..
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ సినిమా ‘రౌడీ జనార్థన’. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు రవికిరణ్ కోలా దీన్ని రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ నాయికగా నటిస్తోంది. శనివారం హీరోయిన్ కీర్తి సురేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్.
దీనికి ‘చిన్న బొట్టు.. పెద్ద పెద్ద కళ్లు.. పొడవాటి జడ.. ఎంత అందంగుంటదో’ అంటూ వ్యాఖ్య జోడించారు. ఈ పోస్టర్లో కీర్తి సురేశ్ సంప్ర దాయ లుక్‌లో అందం గా కనిపిస్తూ ఆకట్టుకు ంటోంది. ఈ డిసెంబర్లోనే థియే ట్రికల్ రిలీజ్‌కు రెడీ అవు తున్న ఈ చిత్రానికి ఆనంద్ సీ చంద్రన్ డీవోపీగా, డినో శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.