సినిమా పవర్ తెలియజెప్పిన కొబ్బరిమట్ట

08-11-2026 | 05:20am

సాయి రాజేశ్ స్క్రిప్ట్(Sai Rajesh's script) అందించి నిర్మించిన హిలేరియస్ మూవీ ‘కొబ్బరిమట్ట’. సంపూర్ణేశ్ బాబు(Sampoornesh Babu) హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న రీ రిలీజ్‌కు రాబోతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై(Amrutha Productions banner) సాయి రాజేశ్ నిర్మించారు. ఇషికా సింగ్, గీతాంజలి, షకీలా కీలక పాత్రల్లో నటించారు. రీ రిలీజ్ సందర్భంగా మేకర్స్ శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా టైమ్‌లో ఫైనాన్స్ పరంగా కష్టాలు చూశాం. 

రిలీజ్ రోజున మ్యాట్నీ, ఫస్ట్ షోలతో ఫలితాన్నిచ్చింది. సినిమాకున్న పవర్ ఏంటో ఆ రోజు తెలిసింది. నాకు బేబి, చెన్నై లవ్ స్టోరీస్ విజయాలు సంతోషాన్నిచ్చినా ‘కొబ్బరిమట్ట’ అందించిన విజయం ఎప్పటికీ మర్చిపోలేను. మరో పదిహేను ఇరవై రోజుల్లో బేబి హిందీ సినిమా షూటింగ్ ఉంది. తర్వాత తెలుగు సినిమా చేస్తా” అన్నారు. హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. “ఈ సినిమాలో సాయి రాజేశ్ నాతో మూడు క్యారెక్టర్స్ చేయించారు. ఈ సినిమాలో నాతో 3 నిమిషాల 20 సెకన్ల భారీ డైలాగ్ చెప్పించాడు.

సాయి రాజేశ్‌తో మరో సినిమా తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నా” అన్నారు. హీరోయిన్ ఇషికా సింగ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఒక సీనియర్ యాక్టర్ అన్నారు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని! కానీ ఈ సినిమాకు ఎన్ని సమస్యలు వచ్చినా సాయి రాజేశ్ స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. ఇప్పుడు ఆయనకు ఫైనాన్స్ దొరుకుతుంది, స్టార్స్ కథలు వింటారు.

సాయి రాజేశ్, సంపూ, మేమంతా ప్యాషన్‌తో వర్క్ చేశాం. ఇప్పటికీ మా రిలేషన్ అలాగే ఉంది. తరుచూ కలవకున్నా.. ఎవరికి ఇబ్బంది వచ్చినా కాల్ చేసి మాట్లాడుకుంటాం. ఆ ఫ్రెండ్‌షిప్ మాలో ఇప్పటికీ అలాగే ఉంది. సక్సెస్ వచ్చినా సాయి రాజేశ్, సంపూ ఏమాత్రం మారలేదు. వాళ్లు అలాగే ఉన్నారు” అని చెప్పారు. 

మరిన్ని వార్తలు