అర్థవంతమైన కథల్ని అందించడమే లక్ష్యం
ప్రేక్షకులకు అర్థమున్న మంచి కథలను అందించడమే నా ప్రధాన లక్ష్యం అని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) అన్నారు. ఆమెకు చెందిన ‘పర్పుల్ పెబుల్ పిక్చర్స్(Purple Pebble Pictures)’ నిర్మాణ సంస్థ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా(Social Media) వేదికగా ఆమె ఒక భావోద్వేగభరితమైన పోస్టును పంచుకున్నారు. “ఒక దశాబ్దం క్రితం ఈ ‘పర్పుల్ పెబుల్ పిక్చర్స్(Purple Pebble Pictures)’ సంస్థను ప్రారంభించినప్పుడు, సమాజంలో ఎంతో ప్రాధాన్యత ఉండి కూడా సరైన గుర్తింపు లేని కథలను, నిజాయితీతో కూడిన అర్థవంతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే అడుగులు వేశా.
ఈ పదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తమ నిర్మాణ సంస్థకు ఎంతో ప్రతిష్టాత్మకమైన, తమ గుండెకు దగ్గరైన కథల్లో మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’ ఒకటి. ఈ సినిమా ద్వారా తాము అనుకున్న రీతిలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వగలిగాం. ఒక దశాబ్దం ముగిసిన తర్వాత, మళ్లీ అదే విధమైన బలమైన కథతో, ఇంకా ఎంతోమందిని ఆకట్టుకునే భావోద్వేగ అంశాలతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. సినిమా పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నేను, ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా.
ఆ సమయంలో సరైన మార్గదర్శకత్వం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డా. ఆ చేదు అనుభవాల నుంచే కొత్త దర్శకులకు, విభిన్నమైన కథలు చెప్పాలనుకునే కొత్త గొంతుకలకు అండగా నిలవాలనే ఆలోచన కలిగింది. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులైన దర్శకులకు ‘పర్పుల్ పెబుల్ పిక్చర్స్’ ఎల్లపపుడూ ఒక మంచి వేదికగా నిలుస్తుంది. భవిష్యత్తులోనూ వినూత్న కథాంశాలతో చిత్రాలను నిర్మిస్తాం” అని తెలిపింది ప్రియాంక చోప్రా.