ఇకపై విజయ్ దేవరకొండనే యాక్షన్ హీరో!
ఇండియన్ సినిమాలో(Indian Cinema) యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పు కుంటారని అన్నారు న్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Director Sandeep Reddy Vam). విజయ్, ష్మిక జంటగా నటించిన రణ బాలి సినిమాను డైరెక్టర్ సందీప్‌రెడ్డి వీక్షించారు. ఈ సినిమా చూసిన అనంతరం తన అనుభూతిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు సందీప్ వంగా. ఈ సినిమాలో విజయ్ చేసిన యాక్షన్, ఫెరోషియస్ పర్ఫార్మెన్స్ యూనిక్‌గా ఉందని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “విజయ్.. నీ యాక్షన్, ఫెరోషియస్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.
స్క్రీన్ మీద నీ ఫైట్స్ చూస్తుంటే ఆ ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాం. ఇకపై ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే నీ గురించే చెప్పుకుంటారు. కంగ్రాట్స్ విజయ్. ప్రేక్షకులు రణబాలి సినిమాను విజయ్ ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కోసం చూడాలి. రష్మిక జయమ్మ పాత్రలో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఎంతో రియలిస్టిక్ ఫీల్‌ను కలిగించింది. అజయ్ మ్యూజిక్ మరో హైలైట్‌గా నిలిచింది. చరిత్ర నుంచి ఇలాంటి ఒక నేపథ్యాన్ని ఎంచుకుని సినిమాగా రూపొందించిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ప్రయత్నం అభినందనీయం. మన పాఠ్యపుస్తకాల్లో చెప్పని చారిత్రక అధ్యాయాన్ని రణబాలి చూపించింది” అన్నారు.