సందేశాత్మకంగా డియర్ ఆస్ట్రోనాట్
యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్య రాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ రచనా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్(Dear Astronaut)’. ఇందులో సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను నవంబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్కు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. “ఆస్ట్రోనాట్’ చాలా మంచి ప్రయోగం.
గొప్ప సందేశాన్ని ఇచ్చేలా సినిమాను రూపొందించారు గొప్ప సినిమాగా నిలుస్తుంది” అన్నారు. సౌమిత్ మాట్లాడుతూ.. “డియర్ ఆస్ట్రోనాట్’లో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. మా సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది” అని చెప్పారు. శ్రేయసి సేన్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో అందమైన ప్రేమకథ ఉంటుంది. సినిమా అందరినీ ఆకట్టుకునేలా, అందరిలో స్ఫూర్తి రగిలించేలా ఉంటుంది” అని తెలిపింది. నటీనటులు శరణ్య ప్రదీప్, కమల్ కామరాజ్, గీతా భాస్కర్, కృష్ణవేణి తదితర చిత్రబృందం ఈ వేడుకలో మాట్లాడారు.