స్లమ్ డాగ్..ముగించారు!
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Tamil star hero Vijay Sethupathi) కాంబోలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’(Slumdog: 33 Temple Road). ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్, జరీనా వహాబ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. మూవీటీమ్ తాజాగా షూటింగ్ అప్డేట్ ఇస్తూ సినీప్రియుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. హైదరాబాద్లో శనివారం జరిగిన చివరి షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్; డీవోపీ: సామ్ కే నాయుడు; ఎడిటింగ్: సంతోష్ నూజిల్లా; సమర్పణ: ఛార్మీ కౌర్; నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల; రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్.