ప్రతి డైరెక్టర్ ఒక్క సినిమా అయినా నిర్మించాలి!
కింగ్ నాగార్జున సమర్పణలో(Presented by King Nagarjuna) తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’('Itlu Arjuna'). అనీష్ హీరోగా(Aneesh is the hero) పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా(Anaswara Rajan female lead.) నటిస్తోంది. మహేశ్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula) ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
“-ఒక మంచి కథతో నిర్మాణ రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో ఉండేది. డైరెక్టర్ మహేశ్ చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. చాలా ఆసక్తికరమైన కథ ఇది. నా తొలి నిర్మాణానికి బాగుంటుందనిపించింది. ఈ కథకు ఫ్రెష్ హీరో అయితే బాగుంటుందనిపించింది. ఇది మూగవాడి పాత్ర. కాబట్టి ఇదివరకు తెలిసిన నటులు అయితే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలియదు. అందుకే ఫ్రెష్‌గా ఉంటుందని అనీష్‌ను తీసుకున్నాం. మేం ఎక్కడా డూప్‌ను ఉపయోగించలేదు. యాక్షన్ అంతా -అనీష్ స్వయంగా చేశాడు.
అనీష్ కోసం నా దర్శకత్వంలో ఒక సినిమా చేసే ఆలోచన కూడా ఉంది. -నాకు ఎప్పుడూ డైరెక్షన్ అనేది చాలా హ్యాపీ, కంఫర్టబుల్ స్పేస్. కాకపోతే, ప్రతి డైరెక్టర్‌నూ ఒక సినిమా నిర్మించమని చెప్తా. ఎందుకంటే ఎక్కడ వేస్టేజ్ ఉంటుంది, ఎక్కడ వర్క్ ఉంటుంది.. అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. ఒక సినిమాకు ప్రతి యూనిట్ ఎంత పని చేస్తుందనేది నిర్మాతకే ఎక్కువగా తెలుస్తుంది. -సినిమా కంటెంట్‌ను ఎంచుకోవడం, దాన్ని నిర్మించడం చేయడం మీద నాకు ఒక ఆలోచన ఉంది.
కాకపోతే, దాన్ని ఎలా రిలీజ్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ఎప్పుడూ ఒక ఒత్తిడిగా ఉండేది. నాగార్జున రావడం వల్ల అది మాకు చాలా కలిసి వచ్చింది. -నాగార్జునకు ఈ సినిమా గ్లింప్స్ చూపించా. ఆ గ్లింప్స్‌లోని విజువల్స్ నచ్చి, మా సినిమాకు పనిచేస్తున్న డీవోపీనే ఆయన ‘కింగ్ 100’ సినిమాకు డీవోపీగా పెట్టుకున్నారు. నాగార్జున లాంటి స్టార్ చూసి అందరినీ మెచ్చుకోవడం నిర్మాతగా నాకు గొప్ప ఆనందాన్నిచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా కంటెంట్ గురించి, అనీష్ పర్ఫార్మెన్స్ గురించి ఆయన చాలా గొప్పగా చెప్పారు.
ఒక మూగవాడి పాత్ర చేయడం చాలా ఛాలెంజింగ్ అన్నారు. అది మాకు చాలా బూస్ట్ ఇచ్చింది. డైరెక్టర్ మహేశ్ ఒక వెబ్ సిరీస్ చేశారు. అది బాగా ఆడింది కూడా. కాకపోతే, మరో సినిమా రావడం అనేది ప్రతి డైరెక్టర్‌కు ఛాలెంజింగ్. అలా తనకు గ్యాప్ వచ్చిన సమయంలో తను రాపిడో డ్రైవర్‌గా కూడా పనిచేశారు. అది నేను విన్నా. చాలా జెన్యూన్‌గా అనిపించింది. తను చాలా టాలెంటెడ్. తన కోసం నిలబడాలనిపించింది. ఈ కథ చెప్పగానే నాకు చాలా నచ్చి ప్రొడ్యూస్ చేశా. -నాకు ఒకరు అవకాశం ఇవ్వడం వల్లే నేను డైరెక్టర్ అయ్యా.
నేను కూడా కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో నిర్మాణం మొదలుపెట్టా. నిజంగా కొత్తవాళ్లు వచ్చి నాకు కథ చెప్తే, అది 100 శాతం కనెక్ట్ అనిపిస్తే కచ్చితంగా నిర్మాణం కొనసాగిస్తా. -ఒక కామెడీ ఎంటర్టైనర్ రాశా. అది మల్టీస్టారర్. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ‘ఇట్లు అర్జున’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి ఇవ్వబోతోంది? -మంచి లవ్ స్టోరీ ఇది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో యాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులు ఆనందంగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసే సినిమా. కచ్చితంగా చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది.