ఆదర్శ కుటుంబం ఆ సినిమాల స్థాయిలో అలరిస్తుంది
విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం గ్రాండ్ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కథానాయకుడు వెంకటేశ్ మాట్లాడుతూ.. “ఆదర్శ కుటుంబం’ను మేము చాలా కొత్తగా ప్రయత్నించాం. ఈ సినిమా మిమ్మల్ని ఏ మాత్రం నిరాశపరచకుండా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో అలరిస్తుందని నమ్ముతున్నాం. ఈ ఆసక్తికర కుటుంబ కథా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “ఆదర్శ కుటుంబం’ అందరికీ నచ్చుతుందని, అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని, ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల తర్వాత ఓ అద్భుతమైన కథతో రావాలనే ఉద్దేశంతోనే ఇంత సమయం తీసుకున్నాం. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం” అని తెలిపారు. కథానాయిక శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. “రేపు థియేటర్లకు వెళ్లి మా ‘ఆదర్శ కుటుంబం’ చూడండి. అంతా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు” అని చెప్పింది. నటుడు నారా రోహిత్, సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు.