విద్యుత్ సరఫరాకు కొత్త ఊతం
- ఓవర్ లోడ్ కు పరిష్కారం
- విజయవంతంగా 5ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఛార్జ్
వెంకటాపూర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): వెంకటాపూర్ సబ్‌స్టేషన్‌లో పెరుగుతున్న విద్యుత్ లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్(5 MVA power transformer) ను బుధవారం విజయవంతంగా ఛార్జ్ చేశారు. దీంతో సబ్‌స్టేషన్ పై ఉన్న అధిక లోడ్ భారం తగ్గడంతో పాటు, పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్‌ఈ బిక్షపతి మాట్లాడుతూ.. 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో అధిక లోడ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, వినియోగదారులకు ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలు తగ్గే అవకాశం ఉందన్నారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.
అధిక లోడ్ సమస్యకు పరిష్కారంగా కొత్త పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంపై వెంకటాపూర్ పరిధిలోని గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ములుగు డివిజన్ డీఈ రాజు, డీఈ ఎంఆర్‌టీ అండ్ కన్‌స్ట్రక్షన్ జగదీశ్ బాబు, ఏఈ ములుగు వేణుగోపాల్, టీఆర్‌ఈ అండ్ ఎస్‌పీఎం ఏఈ మధుసూదన్, ఏఈ రమేష్, సబ్ ఇంజనీర్ సాంబరాజు తో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.