ఎఫ్ఎల్ఎన్ సమీక్ష సమావేశం
గోవిందరావుపేట, నవంబర్ 28 (విజయక్రాంతి) : మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(Government High School) శనివారం మండల స్థాయి ఎఫ్ ఎల్ ఎన్(Mandal-level FLN) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని పాఠశాలల్లో(School) ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమ అమలు తీరును సమీక్షించారు. గతంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్యానెల్ టీమ్ సభ్యులు పాఠశాలలను(Headmaster, Panel Team Members, School) సందర్శించిన సందర్భంగా గుర్తించిన అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ప్రధానంగా విద్యార్థుల చదవడం, రాయడం, గణిత ప్రాథమిక నైపుణ్యాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, తరగతి గది బోధనాభ్యసన ప్రక్రియ, బోధనాభ్యసన సామగ్రి వినియోగం, విద్యార్థుల ప్రగతి పరిశీలన తదితర అంశాలను సమీక్షించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను మెరుగుపరిచేందుకు, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
మండలంలోని అన్ని పాఠశాలల్లో ఎఫ్ ఎల్ ఎల్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, విద్యార్థులలో పునాది స్థాయి అక్షరాస్యత మరియు సంఖ్యా పరిజ్ఞానాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సోమరెడ్డి, మల్లారెడ్డి, ఎల్ఎఫ్ఎన్ ప్రధానోపాధ్యాయులు కేశవరావు, కొర్ర రఘురామ్, సమ్మయ్య, ప్యానెల్ టీమ్ సభ్యులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, జయపాల్, రిసోర్స్ పర్సన్, మహేందర్, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఎం ఆర్ సి సిబ్బంది భూరెడ్డి విష్ణు, బిక్షురాథోడ్ పాల్గొన్నారు.