ఆదివాసీ నాయకుడిపై అనుచిత పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి):ఆదివాసీ హక్కుల పోరాట సమితి(Adivasi Rights Struggle Committee) (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి, చెప్పుల దండ వేసినట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అవమానకర పోస్టు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. సదరు వ్యక్తిని గుర్తించి విచారణ జరిపి కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ, కార్యదర్శి సిడాం నాగోరావు, ఉపాధ్యక్షుడు మడపచి భీంరావు, వాంకిడి మండల అధ్యక్షుడు పంద్రం సురేష్, ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు కోడప జగన్ తదితరులు పాల్గొన్నారు.