అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

16-11-2026 | 04:56pm

మానుకోటలో పింఛన్ల పంపిణీ

మహబూబాబాద్ నవంబర్ 16 విజయ క్రాంతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలను(welfare schemes) అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress People's Government) ముందుకు సాగుతోందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్(Mahabubabad MP Porika Balram Naik), ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు.

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేయూత పథకంలో మంజూరైన 1,220 మందికి నూతన పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పెన్షన్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గూగులోత్ జ్యోతి, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు