అలుపెరగని శ్రమతో...అద్భుత విజయం
మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంతో పోలీసుల్లో నూతన ఉత్సాహం
పసరా పోలీసుల పనితీరుకు ప్రశంసల జల్లు
ఏడు రోజులుగా నిరంతరం కృషి
గోవిందరావుపేట, నవంబర్ 28 (విజయక్రాంతి) : జిల్లాలోని ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు(Corporate Medical Services) అందించేందుకు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్(District SP Sudheer Ramnath Kekan) ఆధ్వర్యంలో చేపట్టిన మెగా హెల్త్ క్యాంప్(Mega Health Camp) అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా పోలీసులు, అన్ని శాఖల అధికారులు మెగా హెల్త్ క్యాంపు సహకరించినప్పటికీ హెల్త్ క్యాంప్ విజయం వెనుక పసర పోలీసుల కటోర శ్రమ, అంకితభావం.. సేవాగుణం స్పష్టంగా కనిపిస్తుంది. గత ఏడు రోజుల నుండి మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం కోసం అన్ని వర్గాల ప్రజల సహకారంతో నిద్ర లేకుండా కటోరంగ శ్రమించారు.
పసర సీఐ పత్తిపాక దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్, పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్విరామ కృషి ఫలితంగా మెగా క్యాంప్ విజయవంతం అయింది. జిల్లా ఎస్పీ సైతం శుక్రవారం రాత్రి 12 గంటల వరకు హెల్త్ క్యాంప్ ఏర్పాటును దగ్గరుండి పర్యవేక్షించారు. ఏది ఏమైనా 5000 మంది ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడంలో పసరా పోలీసుల కృషిపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.