బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత
వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని లక్ష్మీపురం(Laxmipuram) గ్రామానికి చెందిన రత్నం పెద్ద బతుకమ్మ(Late Ratnam Pedda Bathukamma) ఇటీవలే మృతి చెందగా, గ్రామ సర్పంచ్ గుండ్ల సరిత రమేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ 25 కిలోల బియ్యంతో పాటు రూ.2,000 నగదు ఆర్థిక సహాయంగా అందజేశారు.
కష్టకాలంలో బాధిత కుటుంబానికి తోడుగా నిలవడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గుండ్ల దేవేందర్, బండారి శంకరమ్మ, కొమురయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండం సంపత్ రెడ్డి, అజ్మీర సదర్ లాల్, పెంట నరసయ్య, అజ్మీర దేవకుమార్, ఎల్లవేణి కొమురయ్య, నాతి రాజు, గాదె రవి, ఎల్లవేణి రవి, వేల్పుల రఘుపతి, మూడు రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.