సుస్మిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
16-11-2026 | 12:40pm
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆత్మహత్యకు పాల్పడ్డ సుస్మిత కుటుంబాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Bhukya Murali Naik) సోమవారం పరామర్శించారు. నడివాడ గ్రామానికి వెళ్లి సుస్మిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సుస్మిత ఆత్మహత్య(Commits suicide)కు కారకులైన వారిని కఠినంగా శిక్షించి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ వంతు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.