మిత్రునికి అండగా నిలిచిన పదవ తరగతి మిత్రులు
కొల్లాపూర్ లో ఆదర్శంగా నిలుస్తున్న 2001,2002 బ్యాచ్
కొల్లాపూర్ నవంబర్ 3: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని గాంధీ హై స్కూల్(Kolhapur Gandhi High School) 2001, 2002 పదవ తరగతి బ్యాచ్ క్లాస్మేట్ ల అనుబంధం గురించి అందరికి తెలిసిందే. క్లాస్మేట్స్ లో ఎవరికి ఆపద జరిగిన అందరూ స్వచ్ఛందంగా కలిసికట్టుగా తోచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మిత్రుల కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.
అదేవిధంగా మిత్రుల పిల్లలను పాఠశాల చదివించడానికి డబ్బులు డిపాజిట్ కూడా చేస్తూ ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ భరోసాగా ఉంటారు. ఇలాంటివి గతంలో చాలా చేశారు. చాలామంది మిత్రులకు అండగా నిలిచారు.ఇలా స్వచ్ఛందంగా ఒకరికి ఒకరు అండగా ఉండడంతో కొల్లాపూర్ లోనే ఒక మంచి పేరును గాంధీ హై స్కూల్ 2001, 2002 బ్యాచ్ సంపాదించుకొని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇందులోనే క్లాస్మేట్స్ లో ఒకరికి కుడికిళ్ల గ్రామానికి చెందిన ఎస్.అర్జున్ కు ఈ మధ్యకాలంలో ద్విచక్ర వాహన ప్రమాదం జరగడంతో కాలుకు సర్జరీ జరగడం జరిగింది. ఈ సందర్భంగా మిత్రునికి అండగా నిలిచెందుకు ఎప్పటిలాగానే క్లాస్మేట్స్ అందరు తోచిన విధంగా డబ్బును జమ చేసి మంగళవారం అర్జున్ యొక్క ఇంటికి వెళ్లి పరామర్శించి, అతని ఆరోగ్య, కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకొని మిత్రుడికి ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా ఆరోగ్యంగా కోలుకునే వరకు మిత్రులందరం అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని వారికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇటికల వెంకటేశ్ యాదవ్, కోన నరేష్, రిపోర్టర్ అవుట రాజశేఖర్, ఎండి ఫిరోజ్ ఖాన్ , ఉపేందర్ రెడ్డి సుదర్శన్, బసవలింగం,జలకం నరేష్ పాల్గొన్నారు.