అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
తంగళ్ళపల్లి నవంబర్ 3 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్లపల్లి తంగళ్లపల్లి మండలంలో ఖాళీగా ఉన్న ఆరు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి మహిళా శిశు సంక్షేమ శాఖ ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి పి. లక్ష్మీరాజం తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 4న చిన్నలింగాపూర్-1, చిన్నలింగాపూర్-2, గోపాల్‌రావుపల్లి, మండేపల్లి-1 కేంద్రాలకు, నవంబర్ 5న రామచంద్రాపూర్, సారంపల్లి కేంద్రాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో హాజరుకావాలని డీడబ్ల్యూఓ సూచించారు.