పాలెం సంత స్థల మార్పిడి చేయాలని ఫిర్యాదు
బిజినే పల్లి, నవంబర్ 09 : మండలంలోని పాలెం గ్రామంలో(Palem Village) ప్రతి ఆదివారం నిర్వహించే కూరగాయల సంతను(Vegetable market) జిల్లా కేంద్రం ప్రధాన రోడ్డు నుంచి కళాశాల రోడ్డుకు తరలించి స్థల మార్పిడి చేయాలని గ్రామానికి చెందిన మాజీ సైనికుడు డి. వెంకటయ్య సోమవారం ప్రజావాణిలో ఎంపిడోఓకు ఫిర్యాదు(Complaint to MPDO) చేశాడు. కూరగాయల సంత జిల్లా కేంద్రం ప్రధాన రోడ్డుపైనే కొనసాగుతుండటంతో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు రద్దీ విపరీతంగా ఉంటోందని, దీంతో వచ్చి పోయే వాహనదారులకు, చిరు వ్యాపారులకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు.
గ్రామంలో సుమారు 200 మీటర్ల రోడ్డు పొడవునా కూరగాయల సంత జరగడంతో గతంలో ఈ రోడ్డుపై పలు ప్రమాదాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాలెం సంతకు గుడ్లనర్వ, కారుకొండ, కొట్టాలగడ్డ, వెంకటాపూర్, ఖానాపూర్ తదితర చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారని, రోడ్డు మీదే సంత ఉండటంతో వాహనాల దుమ్ము, ధూళి, పొగ కూరగాయలపై పడి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ కూరగాయల సంతను అధికారులు స్పందించి స్థల మార్పిడి చేయాలని గ్రామ ప్రజలు తరుపున కోరుతున్నారు.