ఘనంగా సేవా జ్యోతి ర్యాలీ

07-10-2026 | 09:48pm
  1. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: 
  2. తుళ్ల వీరేందర్ గౌడ్

నాగర్‌ కర్నూల్, అక్టోబర్ 7 ( విజయక్రాంతి ): ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) 25 ఏళ్ల ప్రజా జీవితానికి మద్దతుగా నాగర్‌ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ సేవా జ్యోతి’ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం సాయి గార్డెన్‌లో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’ను లైవ్ ద్వారా నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుళ్ల వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ. మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో దేశాభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం నేడు దేశ ప్రధానిగా కొనసాగుతోందన్నారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు