రాహుల్ గాంధీ ‘పాక్ ఫ్యాన్ బాయ్’

20-11-2026 | 10:12am

రాహుల్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. బీజేపీ ఘాటు కౌంటర్!

న్యూఢిల్లీ: అమెరికాలోని చికాగో యూనివర్సిటీలో(University of Chicago) భారత విదేశాంగ విధానంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దేశీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ తన స్థాయికి తగినంత చురుకైన పాత్ర పోషించడం లేదని, ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఒక Side Playerగా మిగిలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో పాకిస్థాన్ పాత్రను ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ(Pradeep Bhandari) సోషల్ మీడియా వేదిక Xలో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ప్రతి అంతర్జాతీయ వేదికపై రాహుల్ పాకిస్థాన్ ప్రస్తావన తీసుకొస్తున్నారని, విదేశాంగ విధానంలో ఆ దేశాన్ని ఆదర్శంగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన రాహుల్‌ను ‘Pak Fan Boy’ అంటూ వ్యాఖ్యానించారు. 

భారత్ అంతర్జాతీయంగా చేపడుతున్న శాంతి ప్రయత్నాలను రష్యా, ఉక్రెయిన్ గుర్తించాయని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకలకు హోర్ముజ్ జలసంధిలో(Strait of Hormuz) ఇరాన్ వెసులుబాటు కల్పించిందని భండారీ తన పోస్టులో ప్రస్తావించారు. ఈ అంశాలను రాహుల్ విస్మరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు, పాకిస్థాన్‌తో చర్చల విషయంలోనూ రాహుల్ తన వైఖరిని స్పష్టం చేశారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ మద్దతు ఇవ్వడం ఆగినప్పుడే చర్చలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో విదేశాంగ విధానం, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య Political War మరోసారి తెరపైకి వచ్చింది.

మరిన్ని వార్తలు