ఫీజు బకాయిలు విడుదల చేయాలి

20-11-2026 | 05:10am
  1. పాత పద్ధతిలో కొనసాగించాలి
  2. ఏపీ తరహాలో స్కాలర్‌షిప్‌లు పెంచాలి
  3. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, నవంబర్19 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య(MP R Krishnaiah) డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్‌కుమార్ నేతృత్వంలో గురువారం వేలాది మంది విద్యార్థులు అబిడ్స్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు.

దీంతో ఉన్నత విద్య, ఉద్యోగ, విదేశీ విద్యావకాశాలు కోల్పోతున్నారన్నారు. బకాయిలు విడుదల చేస్తామని సీఎం ప్రకటించినా అమలు చేయడం లేదన్నారు.  పాత పద్ధతిలోనే రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగించాలని, ఏపీ తరహాలో స్కాలర్‌షిప్‌రూ.20 వేల వరకు పెంచాలన్నారు. ప్రదర్శనలో నీలా వెంకటేష్, అనంతయ్య, రాజేందర్, శివకుమార్ యాదవ్, మోదీ రాందేవ్, భీమా రాజు, నిఖిల్ పటేల్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు