తుఫాన్ వస్తోంది.. హై అలర్ట్!
తుఫాన్ వచ్చినా ఫోన్ సిగ్నల్ పోదు.. ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం!
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ‘అక్టాన్ (AKVAN)’ తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు, బలమైన గాలులు, వరదల కారణంగా మొబైల్ నెట్వర్క్ సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా Disaster Managementలో కీలకమైన Communication వ్యవస్థ దెబ్బతినకుండా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 70 Cell-on-Wheels (CoW) యూనిట్లు, 197 Mobile Diesel Generator సెట్లు, 61 ప్రత్యేక Support Teamsను రంగంలోకి దించింది. మొత్తం 14 జిల్లాల్లో Telecom Infrastructureను బలోపేతం చేసింది. గంజాం, గజపతి, రాయగడ, మల్కన్‌గిరి, కంధమాల్, కోరాపుట్, పూరీ, భద్రక్, బాలాసోర్, మయూర్భంజ్, ఖుర్దా, జాజ్‌పూర్, కేంద్రపాడ, జగత్సింగ్పూర్ జిల్లాల్లో ఈ ఏర్పాట్లు చేశారు.
తుఫాన్ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా మొబైల్ సేవలు కొనసాగించేందుకు Power Backup, Diesel Generators, ప్రత్యామ్నాయ నెట్వర్క్ సదుపాయాలను సిద్ధం చేశారు. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపడం, Evacuation Operations, Rescue & Relief Activities సజావుగా సాగేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడనున్నాయి. మరోవైపు మొబైల్ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలోని ఆరు జిల్లాల్లో Intra-Circle Roaming (ICR) సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా తమ సొంత SIM నెట్వర్క్ పనిచేయకపోయినా, అందుబాటులో ఉన్న ఇతర Telecom Operators నెట్వర్క్ సిగ్నల్‌ను ఉపయోగించుకోవచ్చు.
గంజాం, గజపతి, పూరీ, కేంద్రపాడ, జగత్సింగ్పూర్, ఖుర్దా జిల్లాల్లో ఈ సదుపాయం కల్పించారు. Airtel, BSNL, Reliance Jio, Vodafone Idea (Vi) వినియోగదారులు అందుబాటులో ఉన్న ఇతర నెట్‌వర్క్‌ల ద్వారా కూడా మొబైల్ సేవలు పొందవచ్చు. నవంబర్ 19 నుంచి నవంబర్ 20 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సదుపాయం అమల్లో ఉంటుంది. తుఫాన్ సమయంలో Emergency Calls, సమాచార వ్యవస్థలకు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.