హరీశ్ అక్రమాలపై చర్యలేవీ?
20-11-2026 | 05:00am
ఆధారాలున్నా ఎందుకు స్పందించడం లేదు?
ట్వీట్‌లో సీఎం రేవంత్‌ను ప్రశ్నించి కవిత
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో మాజీ మంత్రి హరీశ్ రావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత(Telangana Rakshana Sena Chief Kavitha) ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. హరీశ్‌రావు అవినీతి, అక్రమాలకు సంబంధించి ఈనెల 18న సీఎంవో కు ఫిర్యాదు చేసిన లేఖలను ఆమె ట్విట్టర్‌లో బహిర్గతం చేశారు. స్పష్టమైన ఆధారాలున్నా ప్రభుత్వం ఎందుకు మిన్నకుంటుందని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు.