ఏఐసీసీలో కొత్త నియామకాలు

20-11-2026 | 07:11am

కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. పలువురు నేతలకు కొత్త బాధ్యతలు!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ(Congress Party) సంస్థాగత బలోపేతంపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC)లో కీలక నియామకాలు చేపట్టింది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు పార్టీకి చెందిన వివిధ విభాగాలకు పలువురు నేతలను కార్యదర్శులుగా నియమించింది. ఇప్పటికే బాధ్యతలు నిర్వహిస్తున్న మరికొందరు నాయకులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, Organization Structureను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు Communication, Publicity, Media, Social & Digital Media విభాగాల్లో కొత్త బాధ్యతలను కేటాయించారు.

అలాగే Administration, Training & Sandesh, Indian Overseas Congress, Foreign Affairs వంటి కీలక విభాగాలకు కూడా నేతలకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ ప్రచారం, మీడియా సమన్వయం, సోషల్ మీడియా కార్యకలాపాలు, విదేశాల్లో పార్టీ అనుబంధ విభాగాల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నియామకాలు, బాధ్యతల మార్పులకు సంబంధించిన ప్రకటనను AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఆమోదంతో చేపట్టిన ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో పార్టీ జాతీయ స్థాయిలో సంస్థాగత వ్యవస్థకు కొత్త రూపు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది.

మరిన్ని వార్తలు