సీమాపురిలో హైటెన్షన్.. శిథిలాల కింద పలువురు?

07-10-2026 | 06:13pm

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భవన ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సీమాపురి ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేగింది. భవనం కూలిన సమయంలో పక్కనే ఉన్న రెండు మూడు ఇళ్లలోని కొన్ని భాగాలు కూడా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 

మట్టిని, కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తూ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరిని శిథిలాల నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే మొత్తం ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు అనే దానిపై అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. భవనం కూలిపోవడానికి గల కారణం కూడా ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. సీమాపురిలో భవనం కూలిన ఘటనతో ఢిల్లీలో మరోసారి భవనాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు