జెన్ జీ రెగెల్ట్ నిరసన హింసాత్మకం

02-11-2026 | 05:20am
  1. జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాలు లూటీ
  2. వాటర్ కెనన్లు, లాఠీచార్జీ చేసిన పోలీసులు
  3. హింసాత్మక ఘటనలపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి అలెగ్జాండర్
  4. శాంతి, స్వేచ్ఛ కోసమే నిరసనలన్న ప్రతినిధి లీనా ఫ్రెడ్రిక్

జర్మనీ, నవంబర్ 1: పెరుగుతున్న జీవన వ్యయాలు, విద్యాలయాల్లో సౌకర్యాల లేమి, తప్పనిసరిగా సైనిక సేవల్లో పాల్గొనాలనే నిబంధనలకు వ్యతిరేకంగా జర్మనీలో భారీ నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. ‘జెన్ జీ రెగెల్ట్’(Gen G. Regelt)ప్రచార బృందం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలు దాడులు, ఉద్రిక్తతలు, దుకాణాల లూటీ వంటి హింసాత్మకం వైపు పరిణామాలకు దారితీశాయి.

జర్మనీలోని బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ సహా 34 ప్రధాన నగరాల వీధుల్లోకి పెద్ద ఎత్తున నిరసనకారులు రావడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు, భద్రతా బలగాలపై అల్లరిమూకలు పెట్రోల్ బాంబులతో దాడికి దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇదే అదనుగా పలువురు దుండగులు ఫ్రాంక్‌ఫర్ట్‌లోని పలు దుకాణాల అద్దాలు ధ్వంసం చేసి లూటీకి పాల్పడ్డారు. నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తే పరిస్థితులు మరింత ఉద్రిక్తమవుతాయని జెన్ జీ రెగెల్ట్ ప్రకటించింది. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనన్లు ప్రయోగించి, లాఠీచార్జీతో ఆందోళనకారులను చెదరగొట్టారు.

ఫ్రాన్స్ వ్యాప్తంగా 3.20 లక్షల మందికి పైగా 34 నగరాల్లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ నిరసనలపై మంత్రి అలెగ్జాండర్ డోంబ్రిడ్ట్ మాట్లాడుతూ.. నిరసనల పేరుతో అల్లర్లు, దోపిడీ, హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అల్లర్లకు పాల్పడిన అనేకమందిని అరెస్టు చేశామన్నారు. మరోవైపు శాంతి, స్వేచ్ఛ కోసమే ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్న జెన్ జెడ్ రెగెల్ట్ ప్రతినిధి లీనా ఫ్రెడ్రిక్ ప్రకటించారు. 


మరిన్ని వార్తలు