చావో.. లొంగుబాటో? ఉగ్రవాదికి వీడియో కాల్!

18-11-2026 | 09:42am

లతీఫ్ భట్‌కు పోలీసుల వీడియో కాల్.. అసలేం మాట్లాడారంటే?

కుల్గాం: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఉత్కంఠ రేపుతోంది. లష్కరే తొయిబా ఉగ్రవాది లతీఫ్ భట్‌ను(Latif Bhat Video Call) భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన Encounterలో ఇరువైపులా తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. అతడు స్థానిక మసీదులో ఉన్నట్లు గుర్తించిన బలగాలు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశాయి. ఆపరేషన్‌లో భాగంగా అధికారులు లతీఫ్‌కు Video Call చేసి ఆయుధాలు విడిచిపెట్టి ప్రాణాలతో లొంగిపోవాలని కోరారు. తాము సహకరిస్తామని భరోసా ఇచ్చినా అతడు అంగీకరించలేదని సమాచారం. పైగా భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగడంతో బలగాలు Counter Operationను ముమ్మరం చేశాయి.

నవంబర్ 11న సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్టుపై(CRPF checkpoint) జరిగిన దాడిలో లతీఫ్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. దాడికి ముందు లతీఫ్, అతడి సహచరుడు ఉమర్ నిసార్ దార్ మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలామ్ ప్రాంతాల్లో Recce నిర్వహించినట్లు CCTV ఆధారాలు లభించాయి. లతీఫ్‌కు ఆశ్రయం, ఇతర సహాయం అందించిన ఉమర్ సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. గతంలో అనంత్‌నాగ్‌లో పోలీసులపై దాడి, కుల్గాంలో ఇద్దరు వలస కార్మికుల హత్య ఘటనల్లోనూ లతీఫ్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు కుల్గాంలోని పలు ప్రాంతాల్లో Search Operation కొనసాగిస్తున్నాయి. తాజా ఆపరేషన్‌లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.


మరిన్ని వార్తలు