రాహుల్ సంచలన వ్యాఖ్యలు!

18-11-2026 | 09:21am

దేశం ఆర్థిక సంక్షోభం దిశగా.. రాహుల్ కీలక కామెంట్స్!

న్యూయార్క్: భారత ఆర్థిక వ్యవస్థపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలు, తయారీ రంగం బలహీనతలు దేశ అభివృద్ధికి సవాళ్లుగా మారాయని వ్యాఖ్యానించారు. మంగళవారం న్యూయార్క్‌లోని Columbia Universityలో జరిగిన Fireside Chat కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో నిరుద్యోగ సమస్య(Unemployment) తీవ్రంగా ఉందని, విద్యా వ్యవస్థలోనూ లోతైన సమస్యలు ఉన్నాయని రాహుల్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక నమూనా దాదాపు దశాబ్దం క్రితమే ఆశించిన ఫలితాలను ఇవ్వడం ఆపేసిందని అభిప్రాయపడ్డారు. Make in India, Startup India వంటి ప్రభుత్వ కార్యక్రమాలు తయారీ రంగానికి ఆశించిన స్థాయిలో ఊతమివ్వలేకపోయాయని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన Manufacturing Sector బలపడాల్సిన అవసరం ఉందని అన్నారు.

ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతలో భవిష్యత్తుపై భరోసా తగ్గుతోందని రాహుల్ అభిప్రాయపడ్డారు. చదువుకున్నప్పటికీ సరైన ఉద్యోగ అవకాశాలు కనిపించకపోవడం వారిలో నిరాశకు కారణమవుతోందని చెప్పారు. తల్లిదండ్రులు అనుసరించిన కెరీర్ మార్గాలు తమకు పనిచేయడం లేదని యువత భావిస్తోందని వివరించారు. Employment Opportunities, Education Reforms, Economic Growth వంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే దేశం మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు