మహాదేవ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ అరెస్ట్

02-11-2026 | 05:15am
  1. ఒమన్ నుంచి రప్పించిన సీబీఐ
  2. రాయ్‌పూర్ కోర్టులో ప్రవేశపెట్టాక తదుపరి విచారణ
  3. లక్ష కోట్ల బెట్టింగ్‌లో కీలక పరిణామం

న్యూఢిల్లీ, నవంబర్ 1: లక్ష కోట్ల భారీ మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) ప్రధాన నిందితుడు (కింగ్‌పిన్) సౌరభ్ చంద్రకర్‌ను ఎట్టకే లకు సీబీఐ దేశానికి రప్పించింది. ఆదివారం ఒమన్ చంద్రకర్‌ను భారత్‌కు అప్పగించగా అక్కడి నుంచి నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థ భారత్‌కు తీసుకువస్తుంది. అతడిని సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచాక తదుపరి విచారణను చేపట్టనుంది.

ఈ బెట్టింగ్ సిండికేట్‌లో ప్రధాన ప్రమోటర్‌గా సీబీఐ తెలిపింది. మరో ప్రధాన నిందితుడు అభిషేక్ కుమార్‌ను నెల క్రితమే హైదరాబాద్ విమానాశ్ర యం నుంచి సీబీఐ అదుపులోకి తీసుకుంది. దేశం వెలుపల ఉండి నిందితులు 50వేల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌లకు పాల్పడ్డారు. సీబీఐ పేర్కొన్న చార్జీషీ ట్‌లో రూ. 95వేల కోట్ల వరకు బెట్టింగ్ చేపట్టినట్లు పేర్కొంది.

ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా కేసు నమోదు చేసి విదేశాల్లోని రూ. 4,100 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన వారిలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, బాలీవుడ్, టాలీవుడ్ సినీతారలు కూడా ఉన్నారనే ఆరోపణలున్నాయి. వీరికి కూడా నిందితులు భారీ ఎత్తున డబ్బు ముట్టజెప్పి తమ యాప్‌ను ప్రమోట్ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీని ద్వారా వచ్చిన డబ్బును నిర్వాహకులు అక్రమంగా విదేశాలకు మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది.

మరిన్ని వార్తలు