మావోయిస్టుల నగదు డంప్ స్వాధీనం
బీజాపూర్, నవంబర్ 25: ఛత్తీస్గఢ్లో(Chhattisgarh) ‘ఆపరేషన్ కగార్(Operation Kagar)’ తర్వాత మావోయిస్టులు అడవుల్లో దాచిన ఆయుధాలు, నగదు(Weapons, cash) భారీ ఎత్తున భద్రతా దళాలకు లభిస్తోంది. తాజాగా బీజాపూర్ జిల్లా భైరంగఢ్ పోలీస్ స్టేషన్(Bhairangarh Police Station) పరిధిలోని బడేపల్లి అటవీ ప్రాంతంలో రూ.39.77 లక్షల నగదును భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును మావోయిస్టులు ఓ స్టీల్ డబ్బాలో ఉంచి భూమిలో పాతి పెట్టినట్లు గుర్తించారు. అడవుల్లో చేపట్టిన గాలింపు నేపథ్యంలో ఈ నగదు బయట పడింది. బస్తర్లో మావోయిస్టు కార్యకలాపాల కోసమే ఈ డబ్బు నిల్వ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ డంప్ వెనుక ఏ మావోయిస్టు కమిటీ హస్తం ఉందో దర్యాప్తు చేస్తున్నారు.