భారత్ అభివృద్ధి అగ్ర రాజ్యాలకు ఇష్టం లేదు

26-11-2026 | 05:15am

వారి ఆధిపత్యానికి సవాల్ ఎదురవుతుందని భయం

వికసిత్ భారత్ సాధనలో యువతే కీలకం: మోహన్ భగవత్

ఛత్రపతి సంభాజీ నగర్, నవంబర్ 25: ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు భారత్ అభివృద్ధిని(India's Development) కోరుకోవడంలేదని, మనం అభివృద్ధి చెందితే వారి ఆధిపత్యానికి సవాల్ ఎదురవుతుందని అగ్ర రాజ్యాలు(Superpowers) భయపడుతున్నాయంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్(RSS Chief Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బలవంతుడిదే పైచేయి’ అనే సూత్రాన్ని నమ్మే దేశాలు ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

భారత్ వేగంగా అభివృద్ధి చెందితే తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు ఇబ్బందులు ఎదురవుతాయని కొన్ని దేశాలు భావిస్తున్నట్లు ఆరోపించారు. ఇ టీవల చైనా, అమెరికా(America), రష్యా దేశాల సమావేశాన్ని ఉద్దేశించి మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో(Chhatrapati Sambhaji Nagar) జ్ఞాన యజ్ఞ ఫౌండేషన్(Jnana Yajna Foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదో పద్మ మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

భారత్ తన అభివృద్ధితో పాటు ఇతర దేశాల సంక్షేమాన్ని కూడా కోరుకుంటోందని గుర్తు చేశారు. భారత్‌ను వ్యతిరేకించే పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ వంటి పొరు గు దేశాలకూ సాయం చేశామన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర అన్నారు. నిజం మాట్లాడే వారికి మద్దతుగా నిలబడేందుకు, అబద్ధాలను ప్రశ్నించేందుకు యువత సిద్ధంగా ఉందన్నారు. 

అంతర్గత ముప్పే ప్రమాదకరం

దేశానికి బాహ్య ముప్పుల కంటే అంతర్గత ముప్పులే ప్రమాదకరమని మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంతర్జాతీయంగా అధికార సమతుల్యతలో భారీ మార్పులు జరుగుతున్నాయని, ప్రపంచ భద్రత సున్నితమైన దశలో ఉందన్నారు. మూడు రోజుల పాటు జరిగే పద్మ మహోత్సవ్‌లో పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులు తమ అనుభవాలను, విజయగాథలను ప్రజలతో నేరుగా పంచుకుంటారు. 

మరిన్ని వార్తలు