సీఎం రేసులో చంద్రశేఖర్ ఆజాద్

12-11-2026 | 01:52pm

యూపీ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఓవైసీతో చేతులు కలిపిన ఆజాద్!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కూటమి ప్రకటన ఆసక్తికర చర్చకు తెరలేపింది. 2027 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ చేతులు కలిపారు. వీరిద్దరూ కలిసి సామాజిక పరివర్తన్ మోర్చా (Samajik Parivartan Morcha) పేరుతో కొత్త రాజకీయ కూటమిని ప్రకటించారు. ఈ కూటమి తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్‌ను ఓవైసీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

లక్నోలో గురువారం నిర్వహించిన Press Conferenceలో ఓవైసీ ఈ ప్రకటన చేశారు. 2027 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) వరుసగా మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ కూటమి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా తమ Alliance నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ ఆజాద్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ద్వారా కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసినట్లు అయింది. ఇప్పటికే యూపీ రాజకీయాల్లో బహుజన్, మైనారిటీ ఓటు బ్యాంకులపై వివిధ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో AIMIM, ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి ఎన్నికల బరిలోకి దిగడం ఆసక్తి రేపుతోంది. అయితే ఈ కూటమి రాష్ట్రవ్యాప్తంగా ఎంత ప్రభావం చూపుతుంది? ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది? సీట్ల పంపకం ఎలా ఉండబోతోంది? ఇతర పార్టీలతో పొత్తులకు అవకాశం ఉందా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 2027 Uttar Pradesh Assembly Elections సమీపిస్తున్న కొద్దీ ఈ కొత్త కూటమి రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు