తాడూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తంగళ్లపల్లి, నవంబర్ 12 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలో ప్రజా ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రెడ్డిమల్ల సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగేల రాజు గ్రామ ప్రజలకు కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ (Ration Card Distribution) చేపట్టిన ప్రజా ప్రభుత్వానికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ల భరత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, శ్రీరామ్ గౌడ్, గడ్డమీది శ్రీనివాస్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.