ఈ నెల 19న సీఎం సభకు స్థల పరిశీలన

12-11-2026 | 01:45pm

సిద్దిపేట రూరల్, నవంబర్ 12 (విజయక్రాంతి): ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు సంబంధించి సిద్దిపేటలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సభా ప్రాంగణం ఎంపిక, ఇతర ఏర్పాట్లపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ నాగదేవత ఆలయం సమీపంలోని స్థలాన్ని (Meeting Venue) పరిశీలించారు.

సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో స్థల అనుకూలత, సభా ఏర్పాట్లు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై (Public Meeting Arrangements) పరిశీలన చేపట్టారు. సభను విజయవంతం చేసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంప మహేందర్, సిద్దిపేట రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రషీద్ చందీ శ్రీనివాస్, అతిఫ్, తిరుపతి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు