సముద్ర రంగంపై ముర్ము కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యం, దేశాల ఆర్థిక ప్రగతిలో సముద్ర మార్గాల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) అన్నారు. సముద్ర మార్గాల్లో భద్రతకు విఘాతం కలిగితే నిత్యావసర వస్తువుల సరఫరాపై ప్రభావం పడటంతో పాటు ధరలు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కేరళలోని ఎజిమల ఇండియన్ నేవల్ అకాడమీ(Indian Naval Academy, Ezhimala)లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్(INA Passing Out Parade 2026)లో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. స్వదేశీ నౌకా నిర్మాణంతో భారత రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో యుద్ధ స్వరూపం మారుతోందని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు నౌకాదళ అధికారులు నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.