చలో ఢిల్లీ తగ్గేదేలే!

30-10-2026 | 05:05am
  1. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మార్చ్ ఆగదు
  2. పోలీసులు, లాఠీలకు భయపడొద్దు 
  3. దేశ ఆత్మ రక్షణ కోసమే ఈ పోరాటం 
  4. 1న రాజకీయాలకతీతంగా తరలిరండి 
  5. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ   
  6. నేడు ఇండీ కూటమి ఆధ్వర్యంలో ఖర్గే నివాసంలో సీఈసీపై ‘ప్రజా అభిశంసన’

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: బీజేపీ(BJP) ఎన్ని కుట్రలు చేసినా.. నవంబర్ 1న చలో ఢిల్లీ మార్చ్ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పష్టం చేశారు. పోలీసులు, లాఠీలకు భయపడొద్దని, దేశ ఆత్మ అయిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికే ఈ పోరాటమని, రాజకీ యాలకతీతంగా ఈ ప్రత్యేక ర్యాలీకి తరలిరావాలని ఆయన ప్రజలకు, యువతకు, విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఎలాంటి అరాచకాలు లేదా కుతంత్రాలు చేసే ధైర్యం ఉండబోదని పేర్కొన్నారు.

శుక్రవారం సర్ రద్దు, సీఈసీ రాజీనామాపై రాజాజీ మార్గంలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమాన్ని నిర్వహించను న్నారు. ప్రతిపక్ష ఇండీ కూటమి ఆధ్వ ర్యంలో నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో జరగనున్న చలో ఢిల్లీ మార్చ్‌లో పాల్గొనాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈ మార్చ్, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఓట్ల దొంగతనానికి ముగింపు పలకడానికి, రాజ్యాంగా న్ని రక్షించుకోవడానికి ఉద్దేశించినదని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా, విద్యార్థి సంఘాలన్నీ ఇందులో పాల్గొనాలని గురువారం ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియోను విడుదల చేవారు. ఇది దేశం కోసం జరుగుతున్న ఒక ప్రత్యేక నిరసన అని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికే ఈ పోరాటమని రాహుల్ గాంధీ తలిపారు. ‘నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ తీరుతో విసిగిపోయిన వారందరికీ, అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ నేను ఆహ్వానం పలుకుతున్నా’ అని అన్నారు.

‘పోలీసుల గురించి, లాఠీల గురించి చింతించకండి.- బీజేపీకి ఎలాంటి అరాచకాలు చేసే ధైర్యం ఉండదు. మాతో కలిసి నడవండి.- రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మనం కలిసి అడుగు వేద్దాం’ అని పిలుపునిచ్చారు. భారతదేశంపై, తమపై, అలాగే తమ భావ వ్యక్తీకరణ, ఆలోచనలు, దృక్పథాలపై దాడులు జరుగుతున్నాయని భావించే విద్యార్థి సంఘాలన్నీ వారి రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా ఈ మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. ‘మీ అందరినీ రామ్‌లీలా మైదాన్‌లో చూడాలని ఎదురుచూస్తున్నానని తెలిపారు. 

నేడు ‘ప్రజా అభిశంసన’

ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్)లో జరిగిన అవకతవకల ఆరోపణలపై, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ఇండీ కూటమి శుక్రవారం రాజాజీ మార్గ్‌లోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ లఖర్గే నివాసంలో ‘ప్రజా అభిశంసన’ ప్రక్రియను చేపట్ట నుంది. సీఈసీపై ఇండీ కూటమి చేపట్టే ఈ ప్రక్రియకు మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహిస్తారు. అనంతరం ‘ఓటు దొంగతనం’కు వ్యతిరేకంగా జరిగే ‘చలో ఢిల్లీ మార్చ్’పై చర్చించనున్నారు.

రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ, కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా మాట్లాడారు. తెలంగాణలో రైళ్లు అందించడానికి నిరాకరించినా లేదా ఢిల్లీ వ్యాపారులను రాజకీయ సాధనంగా ఉపయోగించుకున్నా, నవంబర్ 1న ‘చలో ఢిల్లీ, రామ్‌లీలా మైదాన్’ మార్చ్‌ను అడ్డుకో వడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని తెలిపారు. ఈ మార్చ్ యథావిధిగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు