కుర్ర హీరోయిన్లకు సవాల్
ఒకసారి డౌన్ ఫాల్ ప్రారంభమైందా.. ఎంతటి స్టార్ హీరో అయిన బౌన్స్ బ్యాక్ అవడం కష్టం. అదే హీరోయిన్ అయితే అంతే సంగతులు. కానీ త్రిష విషయంలో మాత్రం సీన్ రివర్స్. అమ్మడు 20 ఇయర్స్ ఇండస్ట్రీ కెరీర్‌లో డౌన్ ఫాల్స్ బాగానే ఉన్నాయి. అయినా సరే.. 40 ఏళ్ల ఈ భామ కుర్ర హీరోయిన్లకు వరుస ప్రాజెక్టులతో సవాల్ విసురుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఇంత స్పీడుగా దూసుకెళ్లడం త్రిషకే చెల్లింది. వన్నె తరగని అందం, నటనతో ముద్దుగుమ్మ తనకు తిరుగు లేకుండా చేసుకుంటున్నారు.
బిజినెస్ మ్యాన్ వరుణ్‌తో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత అవకాశాలు తగ్గాయి. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు. అవి కాస్తా బెడిసికొట్టడంతో ఇక అమ్మడి పని అయిపోయిందని అంతా భావించారు. కానీ మరింత పవర్‌ఫుల్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యారు. తమిళ స్టార్ హీరోలతో జత కడుతున్నారు. స్టార్ హీరో ఇళయదళపతి విజయ్‌తో.. అజిత్‌తో సినిమాలు చేస్తున్నారు. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. ఇవి కాకుండా మాలీవుడ్‌లో రెండు అవకాశాలు త్రిష పట్టేశారట. అలాగే సూర్యతో ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది.






