18 July, 2026 | 5:33 AM

రియల్ లైఫ్‌లో రీల్ కష్టాలు

01-12-2024 12:00 AM

కొంతమంది నటీనటులు రియల్ లైఫ్‌లో రీల్ లైఫ్ కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అలా సినిమా కష్టాలను అనుభవించిన వారిలో ప్రీతి జింతా ఒకరు. తన రియల్ లైఫ్‌లో సినిమా కష్టాలన్నింటినీ అనుభవించారు. అండర్ వరల్డ్ బెదిరింపులు, బాయ్ ఫ్రెండ్ వేధింపులు వంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొ న్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్, అక్షయ్ వంటి స్టార్ హీరోలతో నటించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రీతి జింతా బాలీవుడ్ హీరోయిన్‌గా మారడం సాధారణ విషయమేమీ కాదు.

13 ఏళ్ల వయసులోనే కారు ప్రమాదం లో తండ్రిని కోల్పోయారు. ప్రీతి తల్లి తీవ్రంగా గాయపడి మంచానపడ్డారు. 1998లో ‘దిల్ సే’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. మంచి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 2003లో ప్రీతి జింతా భరత్ షా కేసులో సాక్షిగా ఉన్న సమయంలో మాఫి యా నుంచి బెదిరింపులను సైతం ఎదుర్కొన్నారు. ఆ తరువాత వ్యాపారవేత్త నెస్ వాడియాతో బ్రేకప్.. చివరకు 2017లో ప్రీతి జింతా జీన్ గూడెనఫ్‌ను వివాహం చే సుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.