18 July, 2026 | 5:55 AM

ఎన్టీఆర్ సరసన అచ్చ తెలుగమ్మాయి

01-12-2024 12:00 AM

నందమూరి  జానకీరామ్ తనయుడు నందమూరి తా రక రామారావు సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని “న్యూ టాలెం ట్ రోర్స్‌” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు. వీణారావు ఫస్ట్ దర్శన్‌ని నిర్మాతలు సు ప్రియ యార్లగడ్డ, స్వప్న దత్ లాంచ్ చేశారు.

ఫస్ట్ దర్శన్ షో రీల్ లో ట్రెడిషనల్, మోడ్రన్ అవుట్ ఫిట్స్‌లో వీణారావు డిఫరెంట్ బ్యూటీఫుల్ లుక్స్ విశేషంగా ఆకట్టుకు న్నాయి. ‘కథలు, సన్నివేశాలు, పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకుల్ని రంజింప చేయ డంలో తన వంతు నిరంతర కృషి చేస్తానని, తన అభిమాన నటి డాక్టర్ పి భానుమతి రామకృష్ణ గారి సాక్షిగా వీణారావు ప్రమా ణం చేశారు. వీణారావు ఫస్ట్ దర్శన్ ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. “అశ్వినిదత్ కాం పౌండ్‌లో ఐదేళ్లపాటు ఉన్నాను. నేను కథానాయకగా పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వీణారావు ఫస్ట్ లుక్ దర్శన్ ని లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.