17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హస్తినాపురం అభివృద్ధికి రూ, 5.57కోట్లు మంజూరు

27-06-2025 01:12 AM

ఎల్బీనగర్, జూన్ 26 : జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావే శంలో హస్తినాపురం డివిజన్ అభివృద్ధి పనులకు రూ, 5.57 కోట్లు మంజూరైనట్లు హస్తినాపురం కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ బానోత్ సుజాత నాయక్ తెలిపారు. ఈ నిధులను రోడ్డు నిర్మాణాలకు ఖర్చు చేస్తున్న ట్లు చెప్పారు. టీకేఆర్ రోడ్ నుంచి వయా గ్రీన్ ల్యాండ్స్ కాలనీ, వందనపురి, సాగర్ ఎంక్లేవ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు (అలేఖ్య టవర్స్ ముందు వరకు) వరకు రోడ్డు ని ర్మాణం చేస్తామన్నారు.

హస్తినాపురం సౌత్ కాలనీలో ఫుట్ పాత్ నిర్మాణం, షిరిడి సాయి నగర్, జడ్పీ రోడ్డు నుం zచి హస్తినాపురం సెంట్రల్ సిగ్నల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసిందని కార్పొరేటర్ సుజాత నాయక్ వివరించారు. ప్రతి కాలనీ అభివృద్ధి చేయడమే లక్ష్యమని, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆశీస్సులతో రాబోయే ఆరు మాసాల్లో డివిజన్ పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తాననిపేర్కొన్నారు.