28 August, 2026 | 1:56 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఓట్ల కోసమే ఎమ్మెల్యే దొంగ హామీలు

27-06-2025 01:10 AM

- టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ 

ఎల్బీనగర్, జూన్ 26 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజల ఓట్లు దండుకోవడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చాడని, 118 జీవో పేరు మీద ప్రజల్ని మోసం చేసింది నిజం కాదా? అని అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ప్రశ్నించారు. గురువారం వనస్థలిపురం డివిజన్ లో వనస్థలి హిల్స్ కాలనీలో రూ, 80 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ... వనస్థలిపురం డివిజన్ లో సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి రూ, 18 కోట్లు మంజూరు చేశారన్నారు. హయత్ నగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు ప్రధాన స్టేషన్ గా ఎల్బీనగర్ చౌరస్తాను ఎంపిక చేసినట్టు తెలిపారు.

త్వరలోనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ పైన అదనపు అంతస్తు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హిల్స్ కాలనీ అధ్యక్షుడు మల్ రెడ్డి యాదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కంచి కృష్ణమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు, నాయకులు గణేశ్ రెడ్డి, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులుపాల్గొన్నారు.