3 April, 2026 | 2:44 AM

ఉట్నూర్ గ్రామపంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతా

03-04-2026 01:01 AM

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వెల్లడి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ రాజర్షి షా

ఉట్నూర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఉట్నూర్ గ్రామ పంచాయతీని మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఉట్నూర్  మేజర్ పంచాయతీ గ్రామ సభను రైతు వేదికలో నిర్వహించారు. గ్రామ సభకు  ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి ఎమ్మెల్యే హాజరైయ్యారు. ముందుగా రాష్ట్ర గీతం జయజయే తెలంగాణ ఆలపించారు. అనంతరం ప్రజల నుండి దరఖాస్తు లను స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికతో ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పరులైన వారికి అందజేసేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్శి షా మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ  సద్వినియో గం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత జాదవ్  అధ్యక్షత వహించగా, ఐటీడీఏ ఇన్చార్జి పిఓ  యువరాజ్ మార్మట్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, పంచాయతీ  పాలకవర్గ సభ్యులు,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.