11 June, 2026 | 1:12 AM

హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. రిమాండ్

11-06-2026 12:00 AM

మూడు కేసులను చేదించిన మద్నూర్ పోలీసులు 

ముగ్గురు నిందితుల  ఆరెస్ట్, రిమాండ్ 

రెండు బైకులు, 4 సెల్ ఫోన్లు, మూడు కత్తులు స్వాధీనం 

బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి 

కామారెడ్డి, జూన్ 10 (విజయక్రాంతి): హైవేల పై ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మద్నూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి తెలిపారు. మద్నూర్ పోలీస్ స్టేషన్లో బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా వివరాలను వెల్లడించారు.

161 వ జాతీయ రహదారిపై ఈ నెల రెండున మద్నూర్ సమీపంలో బైక్ పై ప్రయాణిస్తున్న మహారాష్ట్ర లోని దెగ్లూరు కు చెందిన షేక్ గౌస్ ను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి అతి చూపించి చంపేస్తామని బెదిరించి అతని వద్దన్న మొబైల్ ఫ్రెండ్ తో పాటు 1000 నగదును దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు మద్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి పర్యవేక్షణలో బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, మద్నూర్ ఎస్త్స్ర మోహన్ రెడ్డి, సిసిఎస్‌ఎస్‌ఐ ఉస్మాన్ ల తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్ ల సహాయంతో నిందితులను గుర్తించి మహారాష్ట్రకు చెందిన షేక్ ఇలియాస్, మ హమ్మద్ ఇస్మాయిల్, సమీర్ పాష లను, అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు మోటార్  సైకిల్స్, మూడు కత్తులు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

జాతీయ రహదారులపై  ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులను గుర్తించి  మరనాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడుతున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. ఈనెల ఒకటి నాందేడ్ నుంచి స్ప్లెండర్ బైక్ పై బయలుదేరిన నిందితులు మజ్ను వద్ద షేక్ గౌస్ను దోచుకోవడంతో పాటు అదే రాత్రి జుక్కల్ చౌరస్తా వద్ద శ్రీనివాసులు కత్తితో బెదిరించి మొబైల్ పెంతో పాటు 300 నగదును లాక్కున్నారు. అదే రోజు రాత్రి నిజాంసాగర్ పరిధిలోని చాకలి రాజు వద్ద నుంచి పల్సర్ బైక్ ను దోచుకున్నారు.

జుక్కల్, నిజాంసాగర్ , మదునూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించినట్లు తెలిపారు. నిందితులు సలబద్దపూర్ సమీపంలో మరో వ్యక్తిని అడ్డగించి కత్తితో బెదిరించి దూకుడు చేయాలని చూస్తుండగా అదే సమయంలో వానాల తనకి నిర్వహిస్తున్న పోలీసులు వారిని గుర్తించి బుధవారం వారిని పట్టుకుని అదుపులోకి తీసుకొని విచారణ జరిప గా నేరం ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డి.ఎస్.పి విట్టల్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, మద్నూర్ ఎస్త్స్ర మోహన్ రెడ్డి, సిసిఎస్‌ఐ ఉస్మాన్, కానిస్టేబుళ్లు విట్టల్, విష్ణు, శ్రావణ్ ,శివ, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన వారి బృందాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించినట్లు డి.ఎస్.పి విట్టల్ రెడ్డి తెలిపారు.