10 April, 2026 | 5:18 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం

10-04-2026 03:34 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో(Kalvakuntla Chandrashekar Rao) ఎర్రవెల్లి నివాసంలో, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి(Jeevan Reddy Meet KCR) శుక్రవారం నాడు మర్యాదపూర్వక భేటీ అయ్యారు. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ కలిసినప్పుడు జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అన్నా.. మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపించాడని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి నష్టం జరుగుతోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ తో కలిసి పనిచేయాల్సిన అవసరముందని చెప్పారు. ఇన్నాళ్లకైనా కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి,  ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ దంపతులు వసంత సురేశ్, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.