10 April, 2026 | 5:29 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి

10-04-2026 03:52 PM

తెలివి, శ్రమతో బతుకుబాట నడిపిస్తున్న... ఎర్ర నర్సయ్య

ప్రతిరోజు 1500 నుండి 2000 సంపాదన

తుంగతుర్తి,(విజయక్రాంతి): లక్షల రూపాయలు పెట్టుబడి లేకుండా, తెలివి, శ్రమతో ఓ వ్యక్తి ఇంటింటికి టు వీలర్ సహాయంతో తిరుగుతూ, మెకానిక్ పనిచేస్తూ, ఉపాధి రంగంలో రాణిస్తున్నారు. సూర్యాపేట జిల్లా శౌలి గౌరారం మండలం వెలుగు పల్లి గ్రామానికి చెందిన ఎర్ర నరసయ్య అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా గ్యాస్ స్టవ్, మిక్సీ, సీలింగ్ ఫ్యాన్ వంటి పరికరాల మరమ్మతులు చేయడం ప్రారంభించాడు. ఒకే చోట పని దొరకక, ఇబ్బందులు గురవుతున్న తరుణంలో ఏకంగా టూ వీలర్ కి, వెనక ప్రత్యేకంగా గూడ్స్ బండి తయారు చేసుకొని, దానిలో మరమ్మత్తుల లభించే విధంగా, నూతన పరికరాలు.

మరమ్మత్తులు చేసే సామాగ్రితో సహా, ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేసుకొని, ప్రతి దినము రెండు, మూడు గ్రామాల మొత్తం కలియ తిరుగుతూ, తక్కువ ధరకే గ్యాస్ స్టవ్, మిక్సీ ఫాన్స్ రిపేర్ చేస్తూ, కొత్త పరికరాలను వేస్తూ, తక్కువ ధరకే ఇంటి ముందు పనులు చేస్తూ, ప్రతిరోజు కష్టానికి 1500 నుండి 2000రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆనందంతో తెలిపాడు. ఏది ఏమైనా ప్రభుత్వం స్పందించి ఆర్థిక వనరులు కల్పించినట్లయితే, నాతో పాటు ఇంకా నలుగురికి మెకానిక్ నేర్పి, జీవితంలో స్థిరపడేటట్లు చేస్తానని విజయ క్రాంతి దినపత్రికతో ముచ్చటించారు.