calender_icon.png 18 July, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ అభివృద్ధికి కేసీఆర్ సహకరించలేదు: కిషన్ రెడ్డి

18-07-2025 01:21:13 PM

  1. వరంగల్ ఎయిర్ పోర్టు విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం.
  2. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్రం పూర్తి చేస్తోంది.
  3. కాజీపేట రైల్వే పరిశ్రమతో 3 వేల ఉద్యోగాలు.
  4. కేంద్రం ఎన్నిసార్లు అడిగినా గత ప్రభుత్వం భూమి ఇవ్వలే.

హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ మినహా ఇతర పట్టణాల్లో విమానాశ్రయాలు(Airports) లేవని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర పాలకులు అంతా హైదరాబాద్ చుట్టూనే ఫోకస్ చేస్తున్నారని తెలిపారు. కేంద్రం ఎన్నో సార్లు అడిగినా గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ విమానాశ్రయానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. 20 ఉత్తరాలు రాసినా కూడా కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) వరంగల్ అభివృద్ధికి సహకరించలేదని తెలిపారు. 

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ(Kazipet Coach Factory) నిర్మాణాన్ని కేంద్రం త్వరత్వరగా పూర్తి చేస్తోందని వెల్లడించారు. కాజీపేట యూనిట్ ను కోచ్, వ్యాగన్లు నుంచి ఇంజిన్ల తయారీ వరకు విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. బడ్జెట్ కూడా రూ. 200 కోట్లతో ప్రారంభమై మరో రూ. 200 కోట్లు పెరిగిందని తెలిపారు. కాజీపేట రైల్వే పరిశ్రమతో(Kazipet Railway Industry) దాదాపు 3 వేల ఉద్యోగాలు వస్తాయని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి అనేక కొత్త రైళ్లు మంజూరు అవుతున్నాయని చెప్పిన కిషన్ రెడ్డి జోధ్ పుర్, కచ్, అహ్మదాబాద్ కు నేరుగా రైళ్ల సర్వీసులు వస్తాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ సహా పలు నగరాలు డెవలప్ చేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు టెండర్లు పిలిచామన్నారు. కొమరవెల్లి రైల్వేస్టేషన్ జనవరిలో అందుబాటులోకి వస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.