calender_icon.png 4 September, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి వరద బాధితులకు రూ.50లక్షల సాయం

31-08-2025 12:00:00 AM

-సినీ నటుడు బాలకృష్ణ విరాళం

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటుడు, ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా కామారెడ్డి జిల్లా కకావికలమైంది. వాగులు వంకలు ఏకమయ్యాయి. వాటికి చెరువులు తోడు కావ డంతో పట్టణాలు, ఊర్లపైకి గోదావరి వరద వచ్చింది. ముఖ్యంగా కామారెడ్డిని వరద ముంచెత్తడంతో బాధితులను ఆదుకునేందు కు బాలకృష్ణ ముందుకొచ్చారు. బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.